నల్లగొండ, సెప్టెంబర్ 15 వై7 న్యూస్
బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ విద్యుత్తు కార్యాలయంలో ఆదివారం ఘనంగా ఇంజనీర్స్ దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్బంగా విద్యుత్ డివిజన్ ఇంజనీర్ సంగేపు వెంకటేశ్వర్లు ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,అన్ని వృత్తుల కన్నా ఇంజినీరింగ్ వత్తి చాలా భిన్నమైనదన్నారు. .నిర్మాణరంగంలో సాంకేతిక పరిజ్ఞానం అందించే ఇంజనీర్ ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. దేశాభివద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమన్నారు. అభివృద్ధి పరంగా ముందుకు తీసుకువెళ్లడంలో ఇంజనీర్ల సహాయ సహకారాలు ఎంతో అవసరమన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను ఆదర్శంగా తీసుకొని ఇంజనీర్లు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం శ్రీనివాస్ ఆధ్వర్యం లో జరిగిన కార్యక్రమం లో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్, విద్యుత్ బిసి ఉద్యోగుల ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్కూరు గిరి, ఐ ఎన్ టి సి 327 నాయకులు ఎం రమేష్ రెడ్డి, విశ్వం, తెలంగాణ ఉద్యమ నాయకులు, ముక్కుమూడి శ్రీనివాస్, రాంబాబు, వంశీ, చింత పరమేష్, తదితరులు పాల్గొన్నారు