. ఎన్ కొత్తూరు గ్రామ సమస్యలు పరిష్కరించాలి.
. ప్రగతిశీల మహిళా సంఘం (POW) చర్ల మండలం అధ్యక్షురాలు పూజారి సామ్రాజ్యం
చర్ల మండలం, సెప్టెంబర్ 15 వై7 న్యూస్
చర్ల మండలంలోని పెద్దమిడిసీలేరు పంచాయతీ పరిధిలో ఉన్న ఎన్ కొత్తూరు గ్రామ సమస్యలు పరిష్కరించాలని POW ప్రగతిశీల మహిళా సంఘం చర్ల మండల అధ్యక్షురాలు పూజారి సామ్రాజ్యం ఆదివారం డిమాండ్ చేశారు. గ్రామంలో పంచాయతీ వారు నీరు అందించడంలో ఆలస్యం అయిన ప్రతీ సందర్భంలో ఈ గ్రామంలో ఉన్న మంచి నీటి బావి ఉన్నందున ప్రజలకు నీటి ఎద్దడ ఉండేది కాదని ఆమె తెలిపారు. కాలక్రమేనా ఈ బావిలో చెత్తాచెదారం వర్షపునీరు చేరి బావి మొత్తం మురికిమయమైపోయిందని అన్నారు.ఈ బావిని కూడిక తీయాలని మంచినీటి సౌకర్యాన్ని ప్రజలకు కల్పించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్నా పాపానలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులు నిధులు లేవని నిధులు వచ్చినప్పుడే చేస్తామని చెప్పడం సరైన పద్ధతి కాదు అని అన్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న స్మశాన వాటికకు వెళ్లేదారిలో రోడ్డు లేని కారణంగా గుంతలు గుంతలుగా వర్షం వస్తే మోకాళ్ళబంటి బురద ఉంటుందని అట్టి సమస్యను కూడా తక్షణమే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు కొండ కౌశిక్ ,కార్మిక సంఘం నాయకులు చెన్నం మోహన్, మహిళా సంఘం నాయకులు భాగ్యలక్ష్మి, రమణ, తదితరులు పాల్గొన్నారు.