E-PAPER

హుజూర్‌నగర్ లో ముత్యాలమ్మ జాతర పనులను శ్రీకారం

సల్లకుండ ఎత్తే కార్యక్రమం ప్రారంభం

హుజూర్ నగర్,సెప్టెంబర్13 వై 7 న్యూస్;

హుజూర్ నగర్ పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ముత్యాలమ్మ జాతర ఈనెల 15(ఆదివారం), 16 (సోమవారం) తేదీల్లో జరపాలని సోమవారం ముత్యాలమ్మ జాతర కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. *ఈ రోజు గురువారం పట్టణంలో సల్లకుండ* ఎత్తే కార్యక్రమం ద్వారా ముత్యాలమ్మ జాతర పనులను శ్రీకారం చుట్టారు. స్తానిక రామాలయం వద్ద ఉన్న బొడ్రాయి వద్ద జాతర కమిటీ నిర్వాహకులు కొబ్బరికాయలు కొట్టి సల్లకుండ పనులు ప్రారంభించారు. గురు, శుక్ర శని వారాలలో 3 రోజులపాటు హుజూర్ నగర్ పట్టణము లోని ప్రతి ఇంటికి వెళ్లి అమ్మవార్లకు బోనాలు కానుకలు స్వీకరిస్తారు. 15న ఆదివారం పెద్ద ముత్యాలమ్మ తల్లికి..16న సోమవారం చిన్న ముత్యాలమ్మ తల్లికి..19న గురువారం కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి. పట్టణ ప్రజలందరూ ముత్యాలమ్మ జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని ముత్యాలమ్మ జాతర ఉత్సవ కమిటీ సభ్యులు & కుల పెద్దలు పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :