E-PAPER

మిర్యాలగూడకు సబ్ కలెక్టర్ హోదాలో విధుల్లో చేరిన ఐఏఎస్ అధికారి నారాయణన్

మిర్యాలగూడ , సెప్టెంబర్05, వై7 న్యూస్

నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ కు ప్రభుత్వం సబ్ కలెక్టర్ హోదాను కల్పించింది. జూన్ 16వ తేదీన సబ్ కలెక్టర్ హోదా కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా 15 రెవిన్యూ డివిజన్లకు సబ్ కలెక్టర్ హోదాలు కల్పించారు. అందులో భాగంగా మిర్యాలగూడ కు కూడా సబ్ కలెక్టర్ హోదా కల్పించారు.

రాష్ట్రంలో సబ్ కలెక్టర్ హోదా కల్పించిన రెవెన్యూ డివిజన్ లలో మిర్యాలగూడతో పాటు ఉట్నూరు, భద్రాచలం, కాటారం, కామారెడ్డి, బాన్సువాడ, కల్లూరు, కాగజ్ నగర్, బెల్లంపల్లి, అచ్చంపేట, దేవరకొండ, బోధన్, బైంసా, నారాయణఖేడ్, తాండూరు ఉన్నాయి.

సబ్ కలెక్టర్ గా విధుల్లో చేరిన ఐఏఎస్ అధికారి :

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఐఏఎస్ అధికారి నారాయణన్ అమిత్ గురువారం విధుల్లో చేరారు. ఇంతకాలం పాటు ఆర్డిఓ గా బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాసరావు రిలీవ్ అయ్యారు. నూతనంగా సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నారాయణన్ అమిత్ కు స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి, డి.ఎస్.పి రాజశేఖర్ రాజు , శుభాకాంక్షలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :