భద్రాచలం అక్టోబర్ 2 వై సెవెన్ న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,భద్రాచలం పట్టణంలోని పలు లాడ్జి లను భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. లాడ్జి పరిసరాలు స్పష్టంగా కన్పించేలా తప్పనిసరిగా సి. సి కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమానా స్పదులు లాడ్జిల్లో బస చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
లాడ్జీల్లో బస చేసే యాత్రికుల వద్ద సరైన ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని అందరి వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు చట్ట విరుద్ధంగా ఎవరికీ గదులు ఇవ్వవద్దన్నారు.అనుమానితుల వివరాలను వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు.నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు…
Post Views: 51