కూసుమంచి : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో మంగళవారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం, పాలేరు, మల్లాయిగూడెం, జక్కేపల్లి, గొరిల్లాపాడుతండా, కూసుమంచి, కృష్టాపురం, నాన్ తండా, నర్సింహుల గూడెం గ్రామాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఖమ్మం రూరల్ మండలంలోని వికలాంగుల కాలనీ , నాల్గవ తరగతుల ఉద్యోగుల కాలనీ, తీర్థాల, తనగంపాడు, కస్నాతండా, వాల్యతండా తదితర గ్రామాల్లో పర్యటిస్తారు. ఆయా గ్రామాల్లో వరద బాధితులను పరామర్శించి వారిని ఓదారుస్తారు. ఈ మేరకు టూర్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తుంబూరు దయాకర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పాలేరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కోరారు.
Post Views: 188









