E-PAPER

‘ఇటుకరాళ్ల – చెరువును’ పరిశీలించిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్

కల్లూరు, సెప్టెంబర్ 2 (వై 7 న్యూస్) ;

అతి భారీ వర్షాల కారణంగా కల్లూరు లోని ఇటుకరాళ్ల చెరువు ఆదివారం నాడు గండి పడటంతో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ సోమవారం అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు.
ఆదివారంనాడు పడిన భారీ వర్షాల కారణంగా ఇటుకల చెరువుకు గండి పడి పంట పొలాలు జలమయమయ్యాయి. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ఆదేశాల మేరకు ఐరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ ఈ, డి ఈ తో కలిసి కల్లూరు మండల నాయకులు 24గంటలు శ్రమించి గండి పడ్డ ప్రదేశాన్ని మట్టితో పూడ్చడం జరిగింది.
సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సోమవారం అధికారులతో కలిసి చెరువును పరిశీలించి వివరాలు అడిగి తెలుకున్నారు. చెరువు లోతట్టు ప్రాంత రైతులతో ఎమ్మెల్యే మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు ఆర్ డి ఓ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు డి ఈ, ఈ ఈ,తహసీల్దార్ , ఆర్ ఐ,కల్లూరు ఎస్ ఐ,కల్లూరు ఏ ఎం సి చైర్మన్ నిరజా ప్రభాకర్ చౌదరి , సత్తుపల్లి ఏ ఎం సి చైర్మన్ దోమ ఆనంద్ బాబు , కల్లూరు మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News