E-PAPER

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది;ఎంపీ రవిచంద్ర

ఖమ్మం, అక్టోబర్ 02 వై సెవెన్ న్యూస్;

ఖమ్మం వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పుట్టెడు దుఃఖంతో ఉన్న ప్రజల్ని ఆదుకునేందుకు సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.తక్షణ సహాయక చర్యలు చేపట్టడంలో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఘోరంగా విఫలమయ్యారని వరద బాధితులు ఆక్రోశంతో ఉన్నారన్నారు.ఎంపీ రవిచంద్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితర ప్రముఖులతో కలిసి మున్నేరు వరద ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం సోమవారం మధ్యాహ్నం ఖమ్మం తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడారు.ఇటువంటి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు తమ బీఆర్ఎస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ప్రజల్ని కాపాడే వాళ్లమన్నారు.హెలికాప్టర్స్ ను వెంటనే రంగంలోకి దింపే వాళ్లమని, ఎటువంటి ప్రాణ నష్టం జరుగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకునే వాళ్లమని ఎంపీ రవిచంద్ర వివరించారు.ముంపు ప్రాంతాలలో తిరిగినప్పుడు బాధితుల కష్టాలు, వారికి జరిగిన నష్టాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నామన్నారు.కనీవినీ ఎరుగని రీతిలో మున్నేరు ఉగ్రరూపం దాల్చిందని, గతేడాది వరద వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడడం జరిగిందన్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో తాను, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామ తదితర పెద్దలతో పాటు కలిసి వరద శాశ్వత నివారణకు కరకట్ట నిర్మాణానికి 690కోట్లు మంజూరు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు.ముంపునకు గురైన ప్రాంతాలలో ఇండ్లు బురదతో నిండి ఉన్నాయని, పాములు తిరుగాడుతున్నాయని, సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారని ఎంపీ రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు.వరద కారణంగా ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మందికి ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు, వారి కుటుంబ సభ్యులకు 25లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంపీ వద్దిరాజు డిమాండ్ చేశారు.అదేవిధంగా వరదలో కొట్టుకుపోయి అశ్విని,ఆమె తండ్రి మోతీలాల్ మృతి చెందడం తీవ్ర బాధాకరమన్నారు.ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ శాస్త్రవేత్త అశ్విని అకాల మృతి దురదృష్టకరమన్నారు,ఆమె కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.వరదల కారణంగా దెబ్బతిన్న ఇండ్లకు తక్షణ సహాయం కింద 2లక్షలు, నిత్యావసర వస్తువులు అందజేయాలని ఎంపీ రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సహాయక చర్యల్లో బీఆర్ఎస్ శ్రేణులు చురుగ్గా పని చేస్తున్నాయన్నారు.విష జ్వరాలు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీ వద్దిరాజు ప్రభుత్వానికి సలహానిచ్చారు.విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి,ఆర్జేసీ కృష్ణ,పగడాల నాగరాజు, బమ్మెర రాంమూర్తి,శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, తోట వీరభద్రం,గుండ్లపల్లి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :