ఐ ఎఫ్ టి యు నాయకుల మంగీలాల్ విజ్ఞప్తి
మణుగూరు,సెప్టెంబర్02 వై 7 న్యూస్;
భారీ వర్షాలు ఎన్నడూ లేని విధంగా మణుగూరును ముంచెత్తయని తెలంగాణ ముఖ్యమంత్రి మణుగూరును సందర్శించి ప్రజలకు భరోసా ఇవ్వాలని ఐ ఎఫ్ టి యు నాయకులు ఆంగోత్ మంగీలాల్ కోరారు. సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ మణుగూరు ప్రజలు కనీ వినీ ఎరగని రీతిలో వరద ముంపునకు గురయ్యారని మణుగూరు చరిత్రలోనే ఇంత వరద తొలిసారని వాతావరణం విశ్లేషకులు చెబుతున్నారని ఆకాశంలో మబ్బులు పడుతున్నాయంటే మణుగూరు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని నిన్నటి విపత్తు ప్రజల్లో అంతటి ప్రభావాన్ని చూపించిందని నష్టం అంచనా చెబితే అర్థం అయ్యేది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మణుగూరు సందర్శిస్తే మాత్రమే మణుగూరు ప్రజల వరద ముంపు బాధలు అర్థమవుతాయని వీలైనంత త్వరగా మణుగూరు సందర్శించి వరద ముంపు బాధితులకు అండగా నిలవాలని, బాధితుల కన్నీరు తుడవాలని, అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. అననుకూల వాతావరణ పరిస్థితులలో సైతం పోలీస్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ, ఇతర శాఖలు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నాయకులు సైతం కాపాడటం, బాధితులకు అండగా నిలబడటం నిరాశ్రయులకు అన్న పానీయాలు అందజేయటం లో కూడా మణుగూరు కున్న ప్రత్యేకతను మరోసారి నిరూపించాలని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆపదలో ఆదుకున్న వాడే దేవుడని వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కే గురుమూర్తి, కే నాగేశ్వరరావు, మెట్ల సాంబయ్య, అయితన బోయిన గోపి, కుంట నాగరాజు, ఇలబోయిన శంకర్, కుంజ శ్రీనివాస్, గోవిందా నాగేశ్వరరావు, షేక్ రజబ్ అలీ, చినబాబు, అశోక్, బత్తుల నాగేశ్వరరావు, కుంజా సాయి, సున్నం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.