దమ్మపేట,సెప్టెంబర్02 వై 7 న్యూస్;
దమ్మపేట మండల ప్రజలకు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సాయి కిషోర్ రెడ్డి అన్నారు మండలంలో వర్షాలు భారీగా పడటం వల్ల ప్రజలు బయటకు రావద్దని చెరువులు వైపు ఎవరు వెళ్లకూడదని సూచించారు వాగులు ప్రవహించడంతో జాగ్రత్తగా వహించాలని రోడ్లపై ప్రయాణం చేస్తున్న సమయంలో వర్షం తాకిడిని టూవీలర్ బైకులు జారిపడే అవకాశం ఉందన్నారు కాలినడకన ప్రయాణం చేసే ప్రజలు అప్రమత్తంగా ముఖ్యంగా యువతీ యువకులు సెల్ఫీలు కోసం ప్రాణాన్ని ప్రాణంగా పెట్టవద్దని తెలిపారు మండల పోలీస్ యంత్రాంగం మండల పరిధిలో ఉన్న శాఖల సహకారంతో ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని తెలిపారు అటువంటి ఆటంకాలు జరగకుండా ప్రతిష్టంగా పనిచేస్తామని ఎస్సై అన్నారు ఎటువంటి ప్రమాదం ఎదురైనా 24 గంటలు అందుబాటులో ఉంటామని అవసరమైతే జిల్లా పోలీస్ శాఖ సాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సిద్ధంగా ఉంటామని తెలిపారు పోలీస్ సేవలు వినియోగించుకోవాలని ప్రజలు లోతట్టు ప్రాంతాలు వెళ్లకుండా పూర్తి బాధ్యత తీసుకుంటామని ఎస్ఐ తెలియజేశారు