. సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్
గుండాల,ఆగస్టు 27 వై 7న్యూస్
మండలంలో పంట రుణమాఫీ కానీ రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో గుండాల మండల కేంద్రంలో ప్రదర్శన నిర్వహించి మండల తహసిల్దార్ ఇమ్మానీయులు కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ మండలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్బిఐ) ప్రాథమిక సహకార పరపతి సంఘం (పిఎసిఎస్) బ్యాంకులలో ఇప్పటివరకు ప్రభుత్వం మూడు దఫాలుగా కనీసం 40% మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల పంట రుణం మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని,అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆంక్షలు పెట్టి పంట రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని అన్నారు.రేషన్ కార్డు ప్రతిపాదన రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అంటున్నారని గత ప్రభుత్వం అనేక దపాలుగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఒకే రేషన్ కార్డు పై నలుగురు కుటుంబ సభ్యులు రుణం తీసుకుంటే నలుగురికి కలిపి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం శోచనీయమన్నారు.పంట రుణం తీసుకున్న ప్రతి రైతుకు మాఫీ చేసేంతవరకు రైతులందరూ ఐక్యంగా ఉద్యమించాలని రైతులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులుఅరేం నరేష్,పర్శక రవి, యాసారపు వెంకన్న,ఈసం కృష్ణన్న, పెండేకట్ల పెంటన్న తదితరులు పాల్గొన్నారు.









