ములుగు, ఆగస్ట్ 27 వై7 న్యూస్
ములుగు జిల్లా పర్యటన లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రామప్ప దేవాలయానికి రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్ర్తీ, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం శాసనసభ సభ్యుడు తెల్లం వెంకటరావు , భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు , గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పి షభరిష్ లతో కలిసి రామప్ప దేవాలయానికి చేరుకున్నారు.రామప్ప ఆలయ ప్రాంగణం లో పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించారు.రాష్ట్ర గవర్నర్ దేవాలయ వేద పండితులు సంప్రదాయ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర గవర్నర్ రుద్రేశ్వరుడినీ దర్శించుకుని గవర్నర్ ప్రత్యెక పూజలు చేశారు. వేద పండితులు గవర్నర్ ను పట్టు వస్త్రాల తో సత్కరించి , ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ఏటూరు నాగారం పిఓ చిత్ర మిశ్రా, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ సత్య పాల్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.