. పూల.రవీందర్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పూల రవీందర్ మాట్లాడుతూ చండ్రుగొండ మండలంలో మాల మహానాడు బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని మాలలు అందరూ ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ యుద్ధం మనువాదులకు అంబేద్కర్ వాదులకు మధ్య పోరాటమని, బిజెపి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి కుటిలయత్నమని, ఈ పాసికలో దళితులు పడ వద్దని దళితులలో ఉన్నటువంటి 54 ఉపకులాల వారం తిప్పి కొట్టాలని, ఇది మాల, మాదిగల మధ్య ఆదిపత్య పోరు కాదని, దళితులందరూ ఐక్యంగా ఉండి క్రిమిలేయర్ పద్ధతిని మరియు వర్గీకరణ వ్యతిరేక పోరాటం చేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయి.రాజా, వంశి, శ్రావణ్, నగేష్ అబ్బ, బాలకృష్ణ, శేఖర్ ,విష్ణు తదితర మాలమహానాడు నాయకులు పాల్గొన్నారు.