E-PAPER

ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాల దోపిడీపై చర్యలు చేపట్టాలి

. అనుమతులు లేని , వైద్యశాలలు, ల్యాబ్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

జిల్లా వైద్యాధికారికి సామాజిక కార్యకర్త కర్నె రవి వినతి

మణుగూరు, : మండలంలో ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరుగుతున్న అధిక ఫీజుల దోపిడిని అరికట్టాలని, ఆయా వైద్యశాలల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని,సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది కర్నె రవి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన జిల్లా వైద్య ఆరోగ్య
శాఖ అధికారి భాస్కర్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం రవి మా
ట్లాడుతూ.. ఏజెన్సీలో ధనార్జనే ధ్యేయం
గా కొందరు వైద్యులు దోపిడికి పాల్పడుతు
న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణుగూ
రు పట్టణంలో ఉన్న ప్రైవేట్ హాస్పటల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోగులను పీల్చిపిప్పి చేస్తున్నాయని,వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ లేక పోవడమే దీనికి కారణమని అన్నారు.అధిక ఫీజులు వసూలు చేసే హాస్పటల్స్ పై అధికారులు తనిఖీలు నిర్వహించాలని కోరారు . 2011 మెడికల్ ఎస్టాబ్లేషన్ చట్టం ప్రకారం ప్రైవేట్ హాస్పటల్ యజమాన్యం నిబంధనలు పా
టించకుండా చట్టానికి విరుద్ధంగా వ్యవ
హరిస్తున్నరని,ఆస్పత్రికి వచ్చే రోగుల నుం
చి విపరీతమైన ఫీజులు వసూలు చేస్తు
న్నారని,కొన్ని ప్రైవేట్ హాస్పటల్స్ కనీస ఫీజు వివరాలు డిస్ ప్లే చెయ్యడం లేద
న్నారు.ప్రైవేట్ హాస్పటల్స్ ఓపిఫీజు,ల్యా
బ్ ఫీజుల రూపంలో, మెడిసిన్ షాప్ ద్వా
రా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నా
రని ఆరోపించారు.ప్రైవేట్ హాస్పిటల్లో అర్హతలేని నర్సులు,ల్యాబ్ టెక్నీషియన్ పెట్టుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆ
డుతున్నారని అవేదన వ్యక్తంచేశారు.ప్రై
వేట్ హాస్పిటల్స్ పై నిరంతరం తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!