E-PAPER

తుడుం దెబ్బ ఆధ్వర్యంలో గిరిజన తెగలలో వర్గీకరణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం

26/08/2024న, హన్మకొండ లోని గిరిజన భవనం నందు వట్టం ఉపేందర్( రాష్ట్ర అధ్యక్షులు) అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆదివాసి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రొఫెసర్లు, టీచర్లు, జనరల్ సంఘాలు పాల్గొని ST లలో వర్గీకరణ జరగాలని, దాని ద్వారానే, 9 ఆదిమతెగలకు విద్య , ఉద్యోగ, రాజకీయ ఉపాధి రంగాల్లో న్యాయం జరుగుతుందని అన్ని సంఘాలు ఏకగ్రీవంగా ST తెగలలొ వర్గీకరణ చేయాలని తీర్మానం చేయడం జరిగింది,

*—తీర్మానాలు :—*

. గిరిజన తెగలలో వర్గీకరణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ నియమించాలి.

. గిరిజన తెగల వర్గీకరణ పై మేధావులు, మరియు ఆదివాసి సంఘాలతో హైదరాబాద్ కేంద్రంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలి.

. గిరిజన తెగల వర్గీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి, శాసనసభ సభ్యులకు వినతి పత్రాలు అందజేయాలి.

. వర్గీకరణపై గ్రామస్థాయి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ నిర్మాణం ,ప్రచారం నిర్వహించాలి.

మండల స్థాయి అధికారుల నుండి రాష్ట్రస్థాయి అధికారుల వరకు వర్గీకరణ పై వినతి పత్రాలు అందజేయాలి.

. ఆదివాసి ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్తులకు వర్గీకరణ పై పూర్తి అవగాహన కల్పించే విధంగా కరపత్రాలు ,డాక్యుమెంట్స్ ,గోడ పత్రికలు వెంటనే ప్రచారంలోకి తీసుకురావాలి.

. జిల్లా కేంద్రాలు ,ఐటీడీఏ ప్రాంతాలు మరియు యూనివర్సిటీలలో ,సమావేశాలు నిర్వహించాలి.
ఈ సమావేశంలో పాల్గొన్న చందా లింగయ్య దొర( ఆదివాసి సంఘాల JAC జాతీయ చైర్మన్),రమణాల లక్ష్మయ్య (తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్), ప్రొఫెసర్ ఈసం నారాయణ, ప్రొఫెసర్ ఈసం సారయ్య దొర, వట్టం నారాయణ( తుడుం దెబ్బ మాజీ అధ్యక్షులు), పొదేం రత్నం( తుడుం దెబ్బ జాతీయ కో కన్వీనర్), గుంపిడి వెంకటేశ్వర్లు( తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), వట్టం కన్నయ్య( తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి), పాయం సత్యనారాయణ( గోండ్వానా సంక్షేమ పరిషత్ ), ముక్తిరాజు( తుడుం దెబ్బ కోకన్వీనర్), అలెం కోటి( రాష్ట్ర ఉపాధ్యక్షులు), వాసం రామకృష్ణ దొర( పొలిటికల్ జేఏసీ కన్వీనర్), కొమరం ప్రభాకర్( తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు), కబ్బాక శ్రావణ్ కుమార్( తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు), చందా మహేష్( తుడుం దెబ్బ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి), రేగా నరేంద్ర కుమార్( తుడుం దెబ్బ జాతీయ కో కన్వీనర్), పోదేం కృష్ణ ప్రసాద్(TWTU), ఇర్ప సారయ్య దొర(AIEF), అయిలబోయిన వీరయ్య(AIEF), వట్టం జనార్ధన్( ములుగు జిల్లా అధ్యక్షులు), వర్ష శ్రీనివాస్( తుడుం దెబ్బ భద్రాది జిల్లా అధ్యక్షులు), వజ్జ ఎర్రయ్య (తుడుం దెబ్బ భద్రాద్రి జిల్లా ఉపాధ్యక్షులు) మోకాళ్ళ కన్నయ్య( తుడుం దెబ్బ భద్రాది జిల్లా కార్యదర్శి), పొదెం రవీందర్( గ్రాడీఏట్ యూనియన్ నాయకులు), సూర్ణపాక వెంకటరత్నం( గంగారం మండల అధ్యక్షులు), గోవింద నరసింహారావు( గుండాల మండల అధ్యక్షులు) చింత వెంకటేశ్వర్లు( గుండాల మండల ప్రధాన కార్యదర్శి), స్వర్ణపాక కిషన్ రావు( డివిజన్ నాయకులు), గొగ్గల ఆర్కే దొర “గిరిజన అభ్యుదయ సంఘం” భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి), మల్లెల సారయ్య( పాకాల కొత్తగూడా మండల ప్రధాన కార్యదర్శి) తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News