E-PAPER

వ్యవసాయ మోటార్లు దొంగతనం చేస్తున్న దొంగల అరెస్ట్.

. 26 కేసుల్లో 4 గురు దొంగలను, దొంగ మోటార్లు కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన గరిడేపల్లి పోలీసులు.

26 కేసుల్లో 4.4 లక్షల విలువగల 31 మోటార్లు, 135 మోటార్ల నుండి దొంగిలించిన మోటార్ కోర్ (కాఫర్ వైర్) అమ్మగా వచ్చిన 10 లక్షల నగదు సీజ్.

. గరిడేపల్లి, మఠంపల్లి, హుజూర్నగర్, పాలకవీడు, చిలుకూరు, మేళ్లచేరువు పోలీసు స్టేషన్ ల పరిధిలో మోటార్లు దొంగతనం కు సంభందించి 26 కేసులు నమోదు.

కోదాడ సబ్ డివిజన్ పరిధిలో రైతులు బావులపై, వాగులపై, చెరువు లపై, వ్యవసాయ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్ లు మరియు మోటార్ కోర్ లు (కాఫర్ వైర్) దొంగతానులు చేస్తున్న దానిపై పోలీసు సిబ్బంది అప్రమత్తమై నిఘా ఉంచడం జరిగినది. కేసుల దర్యాప్తు లో భాగంగా ఈ రోజు గరిడేపల్లి పోలీసులు మండల పరిధిలో కల్మలచెరువు రోడ్డు లో పరెడ్డిగూడెం స్టేజి వద్ద వాహనాలు తనికి చేస్తుండగా రెండు ద్విచక్రవానాలపై ఉన్న వ్యక్తులు పోలీసు వారిని గమనించి తప్పించుకోవాలని ప్రయత్నించగా అనుమానాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మోటార్లు దొంగతనం చేసి అమ్ముతున్నట్లు గుర్తించడం జరిగినది. దర్యాప్తు చేసి వీరి నుండి Rs. 4,40,000/- విలువ గల 31 మోటార్ లు, 135 మోటార్ల నుండి దొంగిలించిన మోటార్ కోర్ (కాఫర్ వైర్) అమ్మగా వచ్చిన 10 లక్షల నగదు సీజ్ చేయడం జరిగినది.

ఆంధ్ర రాష్ట్రం NTR జిల్లాకు చెందిన ఉప్పతల వాసు (A1), మఠంపల్లి మండలానికి చెందిన వేముల కోటేశ్వర్ రావు (A2), అకారపు వెంకటి (A3), అజ్మీర మంత్రియ (A4) నలుగురు వ్యక్తులు జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించడం కోసం హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలో గత సంవత్సర కాలం నుండి నుండి గరిడేపల్లి, హుజూర్నగర్, మట్టంపల్లి, మేళ్లచెరువు, పాలకవీడు, చిలుకూర్ పోలీసు స్టేషన్ ల పరిధిలో వ్యవసాయ బావులపై మరియు వాగులపై, చెరువులపై రైతులు నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్తు మోటార్ లను దొంగిలించడం కోసం పగటిపూట రక్కి చేసి మోటార్ లు ఎక్కడ ఉన్నావో గుర్తించి అదే రోజు రాత్రి కానీ తెల్లారి కానీ అర్ధరాత్రి బైక్ మరియు ట్రాలి ఆటొ పై వచ్చి వీలు అయితే మోటార్ లు ఎత్తుక వెళ్లడం లేదా మోటార్ లోని వైండింగ్ కోర్ ఎత్తుక వెళ్ళి వాటిని మట్టంపల్లి గ్రామానికి పాత ఇనుము వ్యాపారి గడగంట్ల శ్రీను కు అమ్మి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్