E-PAPER

మాచర్లలో దారుణం;కన్నకూతురుపై తండ్రి లైంగిక దాడి..

కూతురికి మూడు సంవత్సరాల వయసు నుండి ఈఘాతుకం.. ఇప్పుడు ఆ పాపకి ఐదు సంవత్సరాలు.తల్లికి తెలిసి భర్తను ఖండించిన భార్య.భర్త ప్రవర్తన తట్టుకోలేక రెండేళ్ల క్రితం పిల్లలతో పుట్టింటికి వెళ్ళిన భార్య.ఇరవై రోజుల క్రితం పెద్దమనుషుల సమక్షంలో నేను మారాను,మరోసారి అలా చేయను నన్ను నమ్ము అని మాయమాటలు చెప్పడంతో నమ్మి కాపురానికి వెళ్ళిన భార్య.నిద్రించే ముందు తల్లి కూతుళ్ళకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తాగమని బలవంతం.తాగాక నిద్రమత్తులో ఉండగా కన్నకూతురు పై లైంగిక దాడి..
ఇది పదిరోజుల నుండి జరుగుతున్న పరిస్థితి..
ఉదయాన్నే చిన్నారి నిద్రలేచి మూత్ర విసర్జన సమయంలో మంట,నొప్పి అని ఏడుస్తుండంతో గమనించి తట్టుకోలేక తల్లడిల్లిపోయిన తల్లి..కన్న కూతురుపై ఇలాంటి నీచాతినీచానికి పాల్పడుతున్న దుర్మార్గపు తండ్రికి శిక్ష పడాలని కోరుతున్న తల్లి.ఇలాంటి అల్లుడు మాకొద్దు అంటూ బోరున విలపిస్తున్న చిన్నారి అమ్మమ్మ,తాతయ్య.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్