E-PAPER

గొల్లగూడెం గ్రామంలో లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

అశ్వాపురం, ఆగస్టు 26 వై 7 న్యూస్

నియోజకవర్గంలో అత్యధిక యాదవ కుటుంబాలు ఉన్న గ్రామంగా ప్రసిద్ధిగాంచిన గ్రామం గొల్లగూడెం.ఈ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం అంబరాన్ని అంటుతాయి అన్నట్టు జరుగుతాయి. ఈ వేడుకల్లో గ్రామం లోని గ్రామ పెద్దలు, కుల పెద్దలు ప్రతి ఒక్కరు కలిసి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. గత 14 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గ్రామంలో ఉట్టిగొట్టే కార్యక్రమం , ప్రతివీధుల్లో ఉట్టి కార్యక్రమాలను, గ్రామ కుల పెద్దల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ఈ వేడుకలను కుల పెద్దలు అందరూ కలిసి ప్రారంబిస్తారు. ముఖ్యంగా గ్రామ పెద్ద గొల్ల రాసాల రామయ్య , గ సారగొల్ల తోట కృష్ణయ్య సమక్షంలో ఈ వేడుకలు అంబరాన్ని అంటుతాయి.గోపికలకు ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణుడు , గోపాలుడి జన్మదిన వేడుకలను ఎంతో వైభవంగా పిల్లలు పెద్దలు, అడవాళ్ళు, యువకులు భక్తిశ్రద్ధలతో ప్రతి సంవత్సరం ఆ మురళి నాధుడి జన్మదిన వేడుకలను గొల్లగూడెం గ్రామం పెద్దలు కలిసి ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది . ఈసారి కూడా యువకులు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉట్టి కొట్టడం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్