హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలోని 24 వార్డులోనీ చింతల బజార్లో త్రాగునీటి అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజల దాహార్తిని తీర్చేందుకు మున్సిపల్ చైర్మన్ కి గెల్లి అర్చనరవి వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి వార్డ్ కౌన్సిలర్ గుంజా భవాని సహకారంతో మంచినీటి బోర్డును వేయడం జరిగింది. సోమవారం మున్సిపల్ సిబ్బంది మంచినీటి బోరుకు మోటర్ ను పిట్ చేసి వార్డ్ ఇంచార్జ్ యడ్ల విజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు పరిధిలో అన్ని వీధులలో సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాలకురి లాలు వేముల శ్రీను గుంజ నాగార్జున ఓర్సు వెంకన్న TDP రాష్ట్ర BC సెల్ కార్యదర్శి చల్లా వంశి, వార్డు ప్రజలు గుంజ సీతమ్మ, పల్లపు సావిత్రి, చింతల యశోద, కత్తి మరియమ్మ, గుడెపు తిరపమ్మ, పోతన బోయిన రోషమ్మ, గుంజ శిరీష ,గుంజ అంజలి, బాణోత్ విజయా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
