మణుగూరు, ఆగస్ట్ 25 (వై 7న్యూస్)
మణుగూరు పైలెట్ కాలనీ నందు గల ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్ 2000-2007 సంవత్సరం నాటి విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత అపురూప ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆనాటి చిన్ననాటి విద్యార్థులు పిల్లాపాపలతో భర్తలతో కలిసి నేడు నిర్వహించిన అపురూప ఆత్మీయ పూర్వ విద్యార్థుల సదస్సులో వారి వారి చిన్ననాటి మధురస్మృతులను అందరితో ఆత్మీయ పలకరింపులు ఆనందభాష్పాలతో కన్నీళ్లతో ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ అరేయ్ ఒరేయ్ అనుకుంటూ 25 సంవత్సరాలు వెనుకకు పోయి చిన్నపిల్లలుగా వ్యవహరించడం వారి కళ్ళల్లో లక్షలు కోట్లున్న రానీ అపురూప ఆనందాన్ని పొందారు. వారి మనమళ్ళు, మనమరాండ్లను చిన్ననాటి స్నేహితులకు పరిచయాలు చేస్తూ మరుపురాని అపురూపమైన ఆనందాన్ని పొందడం
జీవితంలో మరపురాని జ్ఞాపకాలుగా నిలిచాయి. నాటి గురువులను పాదాభివందనాలు చేస్తూ పలకరిస్తూ పొందిన ఆనందం వెలకట్టలేనిది. 25 సంవత్సరాల చిన్ననాటి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించటములో నాటి విద్యార్థి ప్రస్తుత యువజన కాంగ్రెస్ నాయకులు షేక్ షాబీర్ ఎంతో ఓపికతో కష్టపడి ఈ ఆత్మీయ సమ్మేళనానికి నిర్వహించటంలో షేక్ షా బీర్
మిత్ర బృందం ముందుకు రావడం అభినందనీయం.