అశ్వాపురం,ఆగస్టు25(వై 7న్యూస్);
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
ప్రభుత్వ స్థలాల ఆక్రమణ అక్రమ కట్టడాలపై కూల్చివేతలు చర్యలు తీసుకోవడం అభినందనీయమననీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య అన్నారు. హైడ్రా ను గ్రేటర్ హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకు మండల జిల్లా కేంద్రాలకు విస్తరింప చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ లేదా ప్రత్యేక అధికారిని నియమించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని అక్రమ కట్టడాలను నిర్మించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కట్టడాలను కూల్చి వేసి ప్రభుత్వం స్వాధీనపరచుకొని ప్రభుత్వ ప్రజా అవసరాలకు వినియోగించే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఓరుగంటి బిక్షమయ్య కోరారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
