E-PAPER

శ్రీనివాస మునుస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు భారీ సహాయం

మణుగూరు, ఆగస్టు 25 ( వై 7న్యూస్);
ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ,బడుగు, బలహీన వర్గాలు చదువుకు దూరంగావుండి ,ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద విద్యార్థుల కోసం, శ్రీనివాస మునుస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శరత్ అద్దంకి వారి ఆధ్వర్యంలో వారికి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు.
దీనిలో భాగంగా మణుగూరు సంతోష్ నగర్ లో ఉన్నటువంటి శ్రీవిద్య ఆశ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం వారు చదువుకోవడం కొరకు వారు ఆర్థిక ఇబ్బంది లేకుండా మూడు పూటలా భోజనం చేయుట కొరకు , వారి నిత్యవసరాల కొరకు సరుకులు రెండు నెలలకు సరిపోను సుమారు రెండు లక్షల పదివేల రూపాయల సరుకులు ఆదివారం నాడు శ్రీనివాస మునుస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ సభ్యులు వెంకటేశ్వర్లు, ఉల్లెందుల సురేష్ ఆధ్వర్యంలో సరుకులను అందజేశారు.
విద్యార్థులు మంచిగా చదువుకొని ఇబ్బందులు లేకుండా ఉంటే ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శరత్ అద్దంకి వారు భవిష్యత్తులో వీరిని పూర్తిస్థాయిలో చదువుటకు కృషి చేస్తామని వారు తెలియజేశారు.
వీరి వెంట స్కూల్ ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి, దుర్గాల సుధాకర్ చంపాల శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్