E-PAPER

ఘనంగా బుద్ధరాజు నరసింహారాజు నవీన్ బాబు గారి జన్మదిన వేడుకలు

మణుగూరు,ఆగస్టు20(వై7న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో బుద్ధరాజు నరసింహ రాజు ( నవీన్ బాబు) పుట్టినరోజు సందర్భంగా నవీన్ బాబు ఆర్మీ సభ్యులు వారి ఇంటి వద్ద నుండి సురక్ష బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి పూల కొట్టు సెంటర్లో టపాసులు పేల్చి నవీన్ బాబుకి శుభాకాంక్షలు తెలియజేసి పలు కార్యక్రమాలు నిర్వహించారు.మణుగూరు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్న వారికి అలాగే గర్భిణీ స్త్రీలకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్స్ అందించారు.అలాగే అమ్మానాన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం,జగ్గారం గ్రామంలోని ఆరిఫా అండ్ రోషిని వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సాయంకాలం సమయంలో సి టైప్ గేట్ ముందు శ్రీ విద్యాభ్యాస బాల వెలుగు స్కూల్లో పిల్లల సమక్షంలో నవీన్ బాబు జన్మదిన వేడుకలను కేక్ కటింగ్ చేసి భోజనం ఏర్పాటు చేసారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News