E-PAPER

మన ఊరు మన బడి పనులు పూర్తి చేయరా?

. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ

జూలూరుపాడు ఆగస్టు 20: జూలూరుపాడు మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ముఖ్యకార్యల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో వంశీ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరు మనబడి పథకం కింద దాదాపు మండలంలోని మూడు పాఠశాల ఎన్నుకోవడం జరిగింది ఈ పాఠశాలలో పనులు పూర్తయ్యాయని చెప్పి అప్పటి ఎమ్మెల్యే వాటిని ప్రారంభించారు అయినా అవి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పనులు కాలేదు అని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఆ బిల్డింగులు అందుబాటులో రాక ఆ పనిలో పూర్తికాక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మన ఊరు మనబడి కింద జరిగిన పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని వంశీ డిమాండ్ చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రత్యేక చోరవ తీసుకొని మండల వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు లేనిపక్షంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాఠశాల ముందు బయట ఇస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్, బాలాజీ ,సాయి తేజ పున్నెత్ కుమార్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్