E-PAPER

పలాసలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీవో

శ్రీకాకుళం జిల్లా, పలాస – వై 7 న్యూస్, నవంబర్ 25:
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలాస మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆర్డీవో ఆర్. అప్పలరాజు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు.
పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, తినుబండారాలు అనుమతించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
పోలింగ్ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, ఓటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీవో సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!