చింతూరు, వై7 న్యూస్ తెలుగు, నవంబర్ 25:
చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. వైఎస్సార్సీపీ , కూటమి మరియు సీపీఎం సర్పంచ్ మరియు వార్డు సభ్యుల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం సాగుతుంది. ఈ స్థానిక హోరులో నువ్వు.. నేనా అంటూ ఇంటి ఇంటికి ప్రచారం ముమ్మరం చేశారు..
ఏడుగురాళ్లపల్లి పంచాయతీ పోరులో మాజీ జెడ్పీటీసీ సభ్యులు, వైఎస్సార్ పార్టీ సర్పంచ్ అభ్యర్ది సోయం అరుణ గ్రామాల్లో పరిచయం ఉన్న వ్యక్తి గా తన గెలుపుకు బలం చేకూరుతుందని , అంతే కాకుండా తాజాగా ఎంపీటీసీ స్థానాన్ని భారీ మెజారిటీ తో కైవసం చేసుకొని బలమైన పార్టీ గా వైఎస్సార్సీపీ ఉంది అనే అభిప్రాయం బలంగా ఉంది. కూటమి పార్టీ అభ్యర్థి కుర్శం కృష్ణవేణి కొత్త ముఖం కావడం తనకు అనుకూలించే అంశం తన గెలుపుకు బలం అని అభిప్రాయం. సీపీఎం పార్టీ అభ్యర్థి మల్లం సుబ్బమ్మ సీనియర్ నాయకులు, అన్ని గ్రామాల్లో ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా తన గెలుపు కు బలం అని అభిప్రాయం. ఈ రేసులో గెలుపు గుర్రం ఎవరు అనేది 29 తారీఖు వరకు వేచి చూద్దాం








