‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న అనన్య శర్మ ప్రస్తుతం ‘హై’ సినిమాతో కథానాయికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్, ‘ఆర్య 2’ గురించి మాట్లాడింది. తనకు అల్లు అర్జున్ ఎప్పటికీ ఫేవరెట్ హీరో అని, ‘దేశముదురు’, ‘ఆర్య 2’ సినిమాలు చాలా ఇష్టమని తెలిపింది.
అయితే ‘ఆర్య 2’లోని ఓ సన్నివేశం, అందులోని డైలాగ్ మాత్రం తనకు నచ్చలేదని అనన్య పేర్కొంది. లిఫ్ట్‌లో కాజల్ అగర్వాల్‌కు అల్లు అర్జున్ ముద్దు పెట్టుకునే సన్నివేశాన్ని ప్రస్తావించింది. చిన్నప్పుడు ఆ సీన్ క్యూట్‌గా అనిపించినప్పటికీ, వయసు పెరిగేకొద్దీ ఆలోచనల్లో మార్పు వచ్చిందని చెప్పింది. ఒక అమ్మాయి అనుమతి లేకుండా ముద్దు పెట్టుకోవడం సరైనది కాదని అభిప్రాయపడింది. ఆ సన్నివేశంపై తనకు అభ్యంతరం ఉన్నప్పటికీ అల్లు అర్జున్‌పై ఎంతో గౌరవం ఉందని స్పష్టం చేసింది.








