భారతదేశ ప్రాచీన నాగరికత, భాషా వైవిధ్యంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. దేశంలో ప్రాంతానికో భాష, ప్రత్యేకమైన మాండలికం, విభిన్న సంస్కృతులు ఉండటం అద్భుతమని కొనియాడారు. భారతదేశంలోని భాషా వైవిధ్యం తనను ఎంతో ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో గతంలో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు.
సెర్బియన్ సినీ దర్శకుడు ఎమిర్ కుస్తురికాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో సుమారు 150 కోట్ల జనాభా ఉండగా, ప్రజలు వివిధ ప్రాంతీయ భాషలను మాట్లాడుతున్నారని మోడీతో సంభాషణ సందర్భంగా తెలుసుకున్నట్లు వివరించారు. ఇంత భారీ జనాభా ఉన్న దేశంలో ఇన్ని భాషలు, మాండలికాలు ఉండటం విశేషమని అన్నారు.
భారతదేశంలోని భాషలు, సంస్కృతులు, ప్రాంతీయ గుర్తింపుల వైవిధ్యం దేశ ప్రత్యేకతను చాటుతోందని పుతిన్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. భారత నాగరికత గొప్పతనాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆయన ప్రశంసించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Post Views: 3








