E-PAPER

అశ్వాపురంలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. ముగ్గురు నిందితుల అరెస్ట్

వాహన తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు.. 3 తులాల బంగారు గొలుసు స్వాధీనం

అశ్వాపురం, అక్టోబర్ 29 (Y7 న్యూస్ తెలుగు): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామపురం గ్రామంలో వృద్ధురాలి ఇంట్లో చోరీకి పాల్పడిన కేసును అశ్వాపురం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి చోరీకి గురైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని అశ్వాపురం సీఐ సీహెచ్ ఎల్లయ్య వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గత సెప్టెంబర్ నెలలో తెల్లవారుజామున సీతారామపురం గ్రామానికి చెందిన బొల్లు సరోజినమ్మ ఇంట్లోకి చొరబడిన దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసుతో పాటు రూ.50 వేల నగదును అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో అక్టోబర్ 28న సాయంత్రం గొల్లగూడెం క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా, సీతారామపురం గ్రామంలో చోరీకి పాల్పడినట్లు అంగీకరించినట్లు సీఐ ఎల్లయ్య తెలిపారు. అలాగే చుంచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన మరో చోరీలోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు.

ఈ కేసులో రేవు సురేష్, గొంది ముత్తయ్య, సల్బం చిన్నాలను అరెస్టు చేసి, వారి నుంచి బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను మణుగూరు కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎస్‌ఐ శివరామకృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!