మోటరోలా అభిమానులకు గుడ్ న్యూస్. ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2026’లో తన కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ ఫస్ట్ లుక్ రివీల్ చేసిన తర్వాత, కంపెనీ ఇప్పుడు దాని ఇండియా లాంఛ్‌ను కన్ఫర్మ్ చేసింది. Motorola India అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్ కోసం ప్రత్యేక మైక్రోసైట్ ప్రత్యక్షమైంది. అందులో “Stay Tuned, Coming This November” అనే మెసేజ్ ఉంది. దీన్నిబట్టి, ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వచ్చే నెల అంటే నవంబర్ 2026లో భారతదేశంలో లాంఛ్ అవుతుందని స్పష్టమవుతోంది. ప్రస్తుతానికి ఈ ఫోన్‌కు సంబంధించిన ఎటువంటి మైక్రోసైట్ Flipkart లేదా Amazonలో అందుబాటులోకి రాలేదు. అయితే మోటరోలా గత ట్రాక్ రికార్డ్‌ను పరిశీలిస్తే, కంపెనీ తన స్మార్ట్ఫోన్లను చాలా వరకు Flipkartలో విక్రయిస్తుంది, కాబట్టి అక్కడ కూడా త్వరలోనే మైక్రోసైట్ ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది.
ధర ఎంత ఉండొచ్చు?: ధర విషయానికొస్తే, ప్రముఖ టిప్‌స్టర్ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ట్రాకిన్ టెక్‌ను ఉటంకిస్తూ.. మోటరోలా సిగ్నేచర్ 27 ప్రారంభ ధర భారతదేశంలో రూ. 70,000 నుంచి రూ. 80,000 మధ్య ఉండొచ్చని పేర్కొన్నారు. మునుపటి మోటరోలా సిగ్నేచర్ మోడల్‌ను రూ. 59,999 ధరతో ప్రారంభించారు కాబట్టి, ఈ కొత్త అప్‌గ్రేడ్ మోడల్ ధర కాస్త ఎక్కువగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.
క్వాల్కామ్ పవర్ఫుల్ ప్రాసెసర్: ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 2026లో జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో గ్లోబల్‌గా ప్రకటించారు, దీంతో దీని ఫీచర్లు ఇప్పటికే రివీల్ అయ్యాయి. ఇందులో క్వాల్కామ్ అత్యంత పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 చిప్‌సెట్‌ను అందిస్తున్నారు. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుంది. ఫోన్ వేడెక్కకుండా నిరోధించడానికి మోటరోలా అడ్వాన్స్డ్ ‘ఆర్కిటిక్మెష్’ కూలింగ్ సిస్టమ్‌ను పొందుపరిచింది. ఇందులో మునుపటి మోడల్ కంటే 40% పెద్ద 3D వేపర్ ఛాంబర్‌తో పాటు డైమండ్-ఇన్ఫ్యూజ్డ్ థర్మల్ జెల్, లిక్విడ్ మెటల్, కాపర్ మెష్ లేయర్లు ఉన్నాయి. ఇవి ఎక్కువసేపు వాడినా ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు సహాయపడతాయి.
కెమెరా సెటప్: ఫొటోగ్రఫీ ప్రియులకు ఈ ఫోన్ ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పొచ్చు. దీని వెనుక ప్యానెల్లో అధునాతన కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. ఇందులో 50MP సోనీ LYTIA 910 మెయిన్ సెన్సార్ ఉంటుంది. ఇదే సెన్సార్‌ను మునుపటి మోడల్లో కూడా ఉపయోగించారు. అయితే ఇందులో మెయిన్ హైలైట్ 200MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా. AI సపోర్ట్‌తో ఈ కెమెరా 100x ‘సూపర్ జూమ్ ప్రో’కు సపోర్ట్ చేస్తుందని, దీంతో దూరంగా ఉన్న వస్తువులను కూడా అత్యంత స్పష్టంగా, వివరంగా చిత్రీకరించవచ్చని మోటరోలా చెబుతోంది.
పాంటోన్ రంగులలో ప్రీమియం డిజైన్ & లుక్: ఈ ఫోన్ డిజైన్ అత్యంత ప్రీమియం, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది దృఢమైన అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. దీని కెమెరా మాడ్యూల్ సిరామిక్, బ్రష్డ్ అల్యూమినియం కాంబినేషన్‌తో రూపొందించారు. ఈ ఫోన్ రెండు ప్రత్యేక పాంటోన్ కలర్స్‌లో లభిస్తుంది. మొదటిది ‘పాంటోన్ కోల్ స్మోక్’, ఇది ‘టాక్టికల్ వీవ్’ ఫినిషింగ్‌తో వస్తుంది. ఇక రెండో కలర్ ఆప్షన్ ‘పాంటోన్ క్యాపులెట్ ఆలివ్’. ఇది బ్రష్డ్ టెక్స్టైల్-ఇన్స్పైర్డ్ బ్యాక్‌తో వస్తుంది. మోటరోలా త్వరలో అధికారిక లాంచ్ డేట్‌ను ప్రకటించనుంది, మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి.








