శ్రీకాకుళం, అక్టోబర్ 7 (Y7 న్యూస్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర పార్టీ సూచనల మేరకు శ్రీకాకుళంలో సేవా జ్యోతి యాత్రను ఘనంగా నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా బాపూజీ కళామందిర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
అనంతరం బాపూజీ కళామందిర్ నుంచి సేవా జ్యోతి యాత్ర ర్యాలీని ఉత్సాహంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ OBC మోర్చా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు లక్కోజు ధర్మారావు, OBC మోర్చా రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.








