E-PAPER

ములుగు జిల్లాలో సైబర్ నేరాలపై అవగాహనకు ప్రత్యేక ప్రచారం

నకిలీ లోన్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా ఎస్ పి కేకాన్ సుధీర్ రామనాథ్ ఐ పి ఎస్

ములుగు జిల్లా అక్టోబర్ 07 వై7 న్యూస్

ములుగు జిల్లా కేంద్రం లో సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన “Fraud Ka Full Stop”( ఫ్రాడ్ గా ఫుల్ స్టాప్ ) కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సైబర్ మోసాల నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తక్షణ రుణాలు తక్కువ వడ్డీ రుణాలు నిమిషాల్లో లోన్ మంజూరు అంటూ సైబర్ నేరగాళ్లు ప్రజలను ఆకర్షించి లోన్ ప్రాసెసింగ్ ఫీజు అడ్వాన్స్ ఫీజు జీఎస్టీ తదితర పేర్లతో ముందుగా డబ్బులు చెల్లించాలని కోరుతున్నారని తెలిపారు. ఇలాంటి నకిలీ లోన్ ఆఫర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యవసర పరిస్థితుల్లోనూ తొందరపడి ముందస్తు చెల్లింపులు చేయవద్దు ముందుగా ఆఫర్‌ను పరిశీలించాలి రుణదాత వివరాలను ధృవీకరించాలి అధికారిక సంస్థల ద్వారా మాత్రమే రుణ సేవలను పొందాలి అని ఎస్ పి సూచించారు ప్రజలు అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్ మెసేజ్‌లు లేదా లోన్ యాప్‌లకు తమ బ్యాంకు ఖాతా వివరాలు ఓటీపీలు పాస్‌వర్డ్‌లు వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని తెలిపారు ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని అలాగే www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బును నిలిపివేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ డీసీఆర్‌బీ కిషోర్ కుమార్ ములుగు సీఐ దారం సురేష్ ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ వెంకటాపూర్ ఎస్‌ఐ చల్లా రాజు డీసీఆర్‌బీ ఎస్‌ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!