E-PAPER

ఈవీఎం గోదాంలో భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా అమలు

నెలవారీ తనిఖీలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు జిల్లా అక్టోబర్ 07 వై7 న్యూస్ తెలుగు

ములుగు జిల్లాలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) భద్రత విషయంలో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను భద్రతా సిబ్బందిని ఆదేశించారు బుధవారం జిల్లా కేంద్రం లోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నెలవారీగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఈవీఎం గోదాం ప్రధాన ద్వారానికి ఏర్పాటు చేసిన సీల్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు నిరంతర నిఘా వ్యవస్థ విద్యుత్‌ సరఫరా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే పరికరాలను తనిఖీ చేశారు అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే చేపట్టాల్సిన చర్యలు అగ్నిప్రమాదాలు లేదా ఇతర భద్రతాపరమైన సమస్యలు ఎదురైన సందర్భంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సంబంధిత సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు గోదాంలో భద్రతా ప్రమాణాలు నిర్దేశిత నిబంధనల మేరకు అమలయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఈవీఎం గోదాం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు భద్రతా రిజిస్టర్లు సందర్శకుల నమోదు పుస్తకాలు తదితర రికార్డులను పరిశీలించారు గోదాంను సందర్శించే ప్రతి వ్యక్తి వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాలని సూచించారు భద్రతా సిబ్బంది విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఈవీఎంల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ డిప్యూటీ తహసీల్దార్ నితీష్ కుమార్ గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల విభాగం సిబ్బంది సంబంధిత అధికారులు భద్రతా సిబ్బంది పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!