E-PAPER

Y7 News కథనంతో వెలుగులోకి వచ్చిన హరినాథ్ బాబా ఆలయ వారసుల అంశం

భద్రాచలం: హరినాథ్ బాబా ఆలయానికి సంబంధించిన వారసులు లేరని ఒక కమిటీ తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అంశంపై Y7 News ప్రచురించిన కథనానికి స్పందనగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

Y7 News కథనాన్ని చూసిన ఆలయానికి సంబంధించిన ట్రస్ట్ కుటుంబానికి చెందిన నాలుగో తరం వారసులు Y7 News‌ను సంప్రదించారు. తమ కుటుంబానికి ఆలయ ట్రస్ట్‌తో పూర్వం నుంచి సంబంధం ఉందని, తాము ప్రస్తుతం కూడా జీవించి ఉన్న వారసులమని,తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని వారు తెలిపారు.

వారసులు ఉన్నప్పటికీ ఆలయానికి వారసులు లేరని కమిటీ ఎలా తీర్మానించింది? ఆ నిర్ణయానికి ఆధారాలేమిటి? తమ కుటుంబానికి సంబంధించిన వారసత్వ వివరాలు, పాత రికార్డులను అధికారులు పరిశీలించారా? అనే ప్రశ్నలను వారు లేవనెత్తుతున్నారు.

Y7 News కథనం ద్వారా తమ అంశం వెలుగులోకి వచ్చిందని, తమ వద్ద ఉన్న వివరాలు, ఆధారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వారసులు తెలిపారు.

దీంతో హరినాథ్ బాబా ఆలయానికి సంబంధించిన ట్రస్ట్, వారసత్వ హక్కులు, గతంలో సమర్పించిన కమిటీ నివేదికపై మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది.

వారసులు లేరన్న కమిటీ నివేదికకు ఆధారాలేమిటి?
ఇప్పుడు ముందుకొచ్చిన నాలుగో తరం వారసుల వాదనపై అధికారులు ఏం చెబుతారు?

ఈ ప్రశ్నలకు అధికారిక రికార్డులు, ఆధారాల పరిశీలనతోనే స్పష్టత రానుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!