E-PAPER

నిద్ర తగ్గితే బ్లడ్ షుగర్ పెరుగుతుందా..? షాకింగ్ నిజాలు..!

ఒక స్వీట్ తిన్న వెంటనే రక్తంలో షుగర్ లెవెల్స్ కొంతసేపు పెరగడం సహజమే. కానీ ప్రతిరోజూ నిద్ర తగ్గడం మాత్రం శరీరంపై మరో రకమైన ప్రభావం చూపిస్తుంది.

నిద్ర సరిగ్గా లేకపోతే ఇన్సులిన్ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ కష్టమవుతుంది.

అంతేకాదు.. నిద్ర తగ్గినప్పుడు ఆకలిని నియంత్రించే హార్మోన్లలో మార్పులు రావచ్చు. దాంతో స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువ కేలరీల ఆహారం తినాలనే కోరిక పెరగవచ్చు. ఇలా బరువు పెరగడం కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేయొచ్చు.

సాధారణంగా పెద్దలకు రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, పడుకునే ముందు ఫోన్ వినియోగాన్ని తగ్గించడం ఉపయోగకరం.

కాబట్టి అప్పుడప్పుడు ఒక స్వీట్ తినడంపై కంటే.. ప్రతిరోజూ సరైన నిద్ర పొందుతున్నామా అనే విషయంపై కూడా దృష్టి పెట్టండి.

గురక, నిద్రలో శ్వాస ఆగడం లేదా పగటిపూట తీవ్రమైన నిద్రమత్తు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!