E-PAPER

చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ దర్శకనటుడు..!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త చిత్రం ‘కాకా’లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఓ అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చేరికతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా అనురాగ్ కశ్యప్ కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు ఇతర ప్రధాన నటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. విలక్షణమైన, పవర్‌ఫుల్ పాత్రలకు పెట్టింది పేరైన అనురాగ్ కశ్యప్, మెగాస్టార్ చిరంజీవి మధ్య తెరపై వచ్చే ముఖాముఖి సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. “ది వరల్డ్ ఆఫ్ కాకా జస్ట్ గాట్ డెడ్లియర్” అంటూ చిత్రబృందం చేసిన ప్రకటన ఈ అంచనాలకు మరింత బలం చేకూర్చింది.

‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ‘కాకా’ సినిమాపై మొదటి నుంచే భారీ ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే చిరంజీవి పుట్టినరోజున విడుదలైన ‘కాకా’ టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ చేరికతో ఈ ప్రాజెక్ట్‌ మరింత క్రేజీగా మారింది. ఈ చిత్రంలో అనశ్వర రాజన్ కూడా నటిస్తుండగా, మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా భాగం కానున్నారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!