E-PAPER

‘ఆదర్శ కుటుంబం’ మరోసారి పోస్ట్ పోన్..! నాగవంశీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా..?

విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. ఈ ఆకస్మిక పరిణామంతో వెంకటేశ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

సినిమా వాయిదాకు గల కారణాలను నిర్మాత నాగవంశీ స్పష్టంగా వివరించారు. ఆయన మాట్లాడుతూ.. “సినిమాకు సంబంధించిన తుది దశ పనులు ఇంకా పూర్తి కాలేదు. మరో రెండు, మూడు పాటల చిత్రీకరణతో పాటు, కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ కూడా మిగిలి ఉంది. వీటికి తోడు ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించాల్సి ఉంది. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది.. సోషల్ మీడియాలో ఎవరూ వేలెత్తి చూపకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని తెలిపారు.

నిర్ణయించిన తేదీకే విడుదల చేయాలనే తొందరలో నాణ్యతతో రాజీ పడలేమని నాగవంశీ పేర్కొన్నారు. “ప్రేక్షకులతో పాటు మేం కూడా థియేటర్‌లో సినిమా ఫైనల్ కాపీ చూడటం మాకు ఇష్టం లేదు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న కాపీనే థియేటర్లకు అందిస్తాం. సినిమా నాణ్యతకే మా మొదటి ప్రాధాన్యత. అందుకే పూర్తి సంతృప్తిగా అన్ని పనులు ముగించుకుని, కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం” అని ఆయన వివరించారు. 

ప్రస్తుతం చిత్ర బృందం మిగిలి ఉన్న పనులను వేగంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. అయితే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తానికి, భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!