వైన్ షాపుల్లో కనిపించని మద్యం బ్రాండ్లు బెల్ట్ షాపుల్లో ప్రత్యక్షం.. ఎక్సైజ్ శాఖకు సవాల్!
ములుగు జిల్లా, అక్టోబర్ 05 (Y7 News Telugu):
ములుగు జిల్లా పరిధిలోని ఏటూరునాగారం ప్రాంతాల్లో బెల్ట్ షాపుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. అధికారికంగా మద్యం విక్రయించే వైన్ షాపుల్లో అందుబాటులో లేని కొన్ని బ్రాండ్లు, వివిధ రకాల మద్యం సీసాలు బెల్ట్ షాపుల్లో మాత్రం ప్రత్యక్షమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైన్ షాపుల్లో అన్ని రకాల బ్రాండ్లు, అన్ని సైజుల సీసాలు అందుబాటులో ఉండకపోయినా, అదే ప్రాంతంలోని బెల్ట్ షాపుల్లో మాత్రం వినియోగదారులు అడిగిన మద్యం లభిస్తోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో అసలు ఈ మద్యం ఎక్కడి నుంచి వస్తోంది? బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నది ఎవరు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనుమతులు లేని ప్రదేశాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.
వైన్ షాపుల్లో అధికారికంగా విక్రయించే స్టాక్‌కు, బెల్ట్ షాపుల్లో ప్రత్యక్షమవుతున్న మద్యం బ్రాండ్లకు మధ్య సంబంధం ఏంటి?
బెల్ట్ షాపులకు మద్యం సరఫరా అవుతున్న మార్గం ఏది?
ఈ విక్రయాల వెనుక ఎవరున్నారు?
అనే అంశాలపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఎక్సైజ్ సూపరింటెండెంట్ చర్యలు తీసుకోవాలి
ములుగు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఏటూరునాగారం మండలం లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
బెల్ట్ షాపుల్లో లభిస్తున్న మద్యం ఎక్కడి నుంచి వస్తోంది, ఏ వైన్ షాపు నుంచి సరఫరా అవుతోంది, అధికారిక స్టాక్‌తో సంబంధం ఉందా అనే అంశాలపై స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులు, బిల్లింగ్ వివరాలు, సరఫరా వివరాలను అధికారులు పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లు విచారణలో తేలితే నిబంధనల ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వైన్ షాపుల్లో లేని మద్యం బెల్ట్ షాపుల్లో ఎలా ప్రత్యక్షమవుతోంది?
అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖకు సమాచారం లేదా?
బెల్ట్ షాపుల దందాపై ములుగు జిల్లా అధికారులు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు?
నాగారం మండల ప్రజల ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలని ప్రజలు కోరుతున్నారు.









