పాల్వంచ, అక్టోబర్ 5 (వై 7న్యూస్)
నాయకపోడ్ సేవా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జిల్లా కమిటీ ఎన్నికలను నిర్వహించారు.
రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మేసినేని రాజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గాండ్ల రామచందర్, ప్రధాన కార్యదర్శి పోతిల్లా శంకర్, ఉపాధ్యక్షులు తంబళ్ల రవి, ముఖ్య సలహాదారు జగ్గ పుల్లయ్య, సంయుక్త కార్యదర్శి పున్నం రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా పాశం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పిట్టల లక్ష్మణరావు, ఉపాధ్యక్షులుగా పాలెం సత్యనారాయణ, కాపుల నాగరాజు, సహాయ కార్యదర్శిగా ముప్పిడి రమేష్, కార్యవర్గ సభ్యుడిగా కుర్ల రాము ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులకు రాష్ట్ర నాయకులు, సంఘ ప్రతినిధులు, సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాయకపోడ్ సమాజ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో చర్ల మండల కమిటీ సభ్యులు, నాయకపోడ్ సేవా సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.









