E-PAPER

ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 04 (Y7 News Telugu):
అక్టోబర్ 05వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.

ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని ఆయన సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.

ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్వీకరించి, వాటిపై సత్వర చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో కూడా ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలోని అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.

ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!