ములుగు, అక్టోబర్ 04 (Y7 News Telugu):
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ములుగు జిల్లా శాఖ నూతన పాలకమండలి ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యింది. 2026–2029 పదవీకాలానికి సంబంధించిన ఎన్నికలు ములుగులోని రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో నిర్వహించినట్లు ఎన్నికల అధికారి ఎ. ధర్మా నాయక్ తెలిపారు.

ఈ ఎన్నికల్లో జిల్లా చైర్మన్‌గా డాక్టర్ అల్లం అప్పయ్య, వైస్ చైర్మన్‌గా గంగిశెట్టి శ్రీనివాస్, ట్రెజరర్‌గా శిరుప సతీష్ కుమార్ ఎన్నికైనట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్ర పాలకమండలి సభ్యుడిగా కొత్తపల్లి ప్రసాదరావు ఎన్నికైనట్లు పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు బొల్ట్డే హేమంత్ సహదేవరావు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడింది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన ఎన్నికకు అవసరమైన కోరం పూర్తిగా రాకపోవడంతో సమయాన్ని 10.30 గంటలకు పొడిగించి ఎన్నిక నిర్వహించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
జిల్లా పాలకమండలి సభ్యులుగా చుంచు రమేష్, అబ్బు సతీష్, గూడూరు మహిపాల్, కొట్టి రాజిరెడ్డి, వడ్డి శ్రీనాథ్, గారా నరసింహారావు, కోగిల సారయ్య, ముక్కు సుబ్బారెడ్డి, పింగిలి నాగరాజ్, వావిలాల రవితేజ, రామిడి కృష్ణారెడ్డి ఎన్నికైనట్లు వెల్లడించారు.
మొత్తం 15 మంది సభ్యులతో కూడిన నూతన పాలకమండలి వివరాలను ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎన్నికల అధికారి ఎ. ధర్మా నాయక్ తెలిపారు.








