మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RC17’కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో తొలి షెడ్యూల్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు, మొదటి రోజే కెమెరా రోల్ అవ్వకముందే ఒక డెడ్‌లైన్‌ను పెట్టుకున్నారట.
డిసెంబర్ 2027 నాటికి అంటే సరిగ్గా ఏడాది సమయంలో మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలని చిత్ర బృందం టార్గెట్ పెట్టుకుందట. రామ్ చరణ్ వంటి బడా స్టార్ కాంబినేషన్‌లో వచ్చే భారీ చిత్రాలకు లోకేషన్లు, భారీ యాక్షన్ ఎపిసోడ్లు, నటీనటుల డేట్లు వంటి కారణాల వల్ల షూటింగ్ ల్యాగ్ అవ్వడం సహజం. అయితే సుకుమార్ ఈసారి అలాంటి ఆలస్యానికి తావులేకుండా పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఈ టార్గెట్ వల్ల ప్రొడక్షన్ పనులు వేగవంతం అవ్వడమే కాకుండా, పోస్ట్ ప్రొడక్షన్ టీమ్‌కి కూడా తగినంత సమయం లభిస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ అనుకున్న విధంగానే డిసెంబర్ 2027 నాటికి షూటింగ్ పూర్తయితే, అంతటి భారీ ప్రాజెక్ట్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏడాదిలోనే ముగించి రిలీజ్ సమయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసినవారు అవుతారు.








