E-PAPER

తెలంగాణ రక్షణ సేనతోనే సామాజిక న్యాయం సాధ్యం

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం

‘పాంచజన్య’ ఆశయాలతో భద్రాద్రిలో పార్టీ విస్తరణ

కొత్తగూడెం, అక్టోబర్‌ 3 (Y7 న్యూస్)

తెలంగాణలో సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం సాధించడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యమని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సముద్రాల క్రాంతికుమార్‌ అన్నారు. ఇటీవల జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన జిల్లాకు వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.విద్యానగర్‌ నుంచి పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి పోస్ట్‌ఆఫీస్‌ సెంటర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్‌ సెంటర్‌లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుని నివాళులర్పించారు.అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రాంతికుమార్‌ మాట్లాడుతూ.. ‘పాంచజన్య’ పథకాల అమలుకు తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వ ఏర్పాటే అవసరమని పార్టీ భావిస్తోందన్నారు. అందుకు అనుగుణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.పాంచజన్యమే కార్యాచరణకు పునాదితెలంగాణ రక్షణ సేన ప్రకటించిన ‘పాంచజన్యం’ ఐదు ప్రధాన అంశాల ఆధారంగా పార్టీ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు క్రాంతికుమార్‌ తెలిపారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం తమ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమతో కలిసి పనిచేసే యువతకు పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు.జిల్లాలోని ప్రతి గ్రామం, పట్టణం, మండలంలో పార్టీ విస్తరణకు చర్యలు చేపడతామని తెలిపారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులను పార్టీతో అనుసంధానం చేస్తూ కేడర్‌ను సమన్వయం చేసుకుంటామని వెల్లడించారు.సింగరేణి కార్మికుల సమస్యలతో పాటు గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, యువతకు ఉపాధి అవకాశాలు, రైతుల సమస్యలు, కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై పోరాటం చేస్తామని క్రాంతికుమార్‌ తెలిపారు.ఈ సమావేశంలో టీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి.వీరన్న, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి చైతన్య, కార్మిక విభాగం జిల్లా నాయకుడు వాంకుడోత్‌ రవి, విద్యార్థి విభాగం జిల్లా నాయకుడు లకావత్‌ సురేష్‌, ఇల్లందు ఇన్‌చార్జి రామకృష్ణ, అశ్వారావుపేట ఇన్‌చార్జి సోడెం వెంకట్‌, జిల్లా నాయకులు ముసలం రామకృష్ణ, ఖలీల్‌, పృథ్వీరాజ్‌, పవన్‌ నాయక్‌, ఆది, రాంబాబు, ముజాహిద్‌ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!