E-PAPER

జింకలగూడెంలో CASO ఆపరేషన్

41 వాహనాలు గుర్తింపు.. అక్రమ రవాణాపై గ్రామస్తులకు అవగాహన

బూర్గంపహాడ్, అక్టోబర్ 2 (Y7 న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు బూర్గంపహాడ్ మండలం జింకలగూడెం గ్రామంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు సరైన పత్రాలు లేని 41 వాహనాలను గుర్తించారు. వాటిపై నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

అలాగే గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, పశువుల అక్రమ రవాణా వంటి నేరాలపై గ్రామస్తులకు పోలీసులు అవగాహన కల్పించారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!