E-PAPER

సర్ పై జెన్ జీ సమరం..! దద్దరిల్లిన ముంబై, డిల్లీ..!

దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.మరోవైపు స ర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఆందోళనలను ఉధృతం చేసింది.మరో వైపు జెన్‌ జీ 2.O అంటూ CJP కూడా మళ్లీ నిరసన సైరన్‌ మోగించింది. మరోవైపు అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ ను ప్రకటించింది ఈసీ.

జాతిపిత మహాత్మాగాంధీకి గల్లీ నుంచి ఢిల్లీ దాకా యావత్‌ దేశం ఘన నివాళి అర్పించింది.అ దే టైమ్‌లో సర్‌ ప్రక్రియకు నిరసనగా ఆందోళనలు మిన్నంటాయి. సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలంటూ ఆప్‌ సహా ఇండియా కూటమి పక్షాలు ఢిల్లీ జంతర్‌ మంతర్‌ దగ్గర చేపట్టిన నిరసనలు హైటెన్షన్‌ క్రియేట్‌ చేశాయి.

జెన్‌ జీ తరహాలో ఢిల్లీ జంతర్‌ మంతర్‌ మళ్లీ దద్దరిల్లింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు 11 మెట్రో స్టేషన్లను మూసేశారు. BNSS సెక్షన్ 163 కింద ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడంపై ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్‌కు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ సహా 5వందల మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అటు ముంబైలో కాక్రోచ్‌ సేన నిరసనలను హోరెత్తించింది. జెన్‌ జీ 2.ఓ అంటూ శివాజీ పార్క్‌ దగ్గర పిడికిలి ఎత్తారు సీజేపీ కార్యకర్తలు. సైలెన్స్‌ జోన్‌ అన్న కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు, ఫిర్‌ బీ తగ్గేదే లేదంటూ జైల్‌ భరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు సీజేపీ సేనాని అభిజిత్‌ దీప్కే. సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిందేనంటోన్న సీజేపీ.. దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో భారీ నిరసన కార్యక్రమాలకు ప్లాన్‌ చేసింది. అక్టోబర్‌ 6న ఇండియా కూటమి ఢిల్లీలో చేపట్టిన ర్యాలీ,సభలతో తమకు సంబంధంలేదన్నారు అభిజిత్‌ దీప్కే. ఏ రాజకీయ పక్షాలతో తమకు లింక్‌ లేదన్నారు. యువత భవిత కోసం గాంధీజీ స్పూర్తిగా స్వచ్చందగా శాంతియుత నిరసనలు చేపడుతామన్నారు.

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలతో సర్‌ ప్రక్రియ తప్పులతడకగా మారిందనేది విపక్షాలు, సీజేపీ ఆరోపిస్తున్నాయి. ఐతే సమిష్టి నిర్ణయాలతోనే ముందుకు సాగుతున్నామని ఈసీ స్పష్టం చేసింది . ఫార్మ్‌-6 అదనపు డిక్లరేషన్‌ను కంపల్సరీ కాదని క్లారిటీ ఇచ్చింది. చనిపోయిన వారి పేర్ల తొలగింపు, అనర్హుల ఏరివేతనే సర్‌ పక్రియ లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా తాజాగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు. సీఈసీ దిద్దుబాట పట్టినా నిరసనలు మాత్రం తగ్గడంలేదు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!