E-PAPER

జర్నలిస్టులకు షరతుల్లేని హెల్త్ కార్డులు మంజూరు చేయాలి


ఉద్యోగులతో సమానంగా వైద్య సదుపాయాలు కల్పించాలి

సీఎం రేవంత్‌రెడ్డికి పోస్ట్‌కార్డుల ద్వారా జర్నలిస్టుల వినతి

కొత్తగూడెం టౌన్, అక్టోబర్ 2 (Y7 న్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు ఎలాంటి ఆంక్షలు, షరతులు లేకుండా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) 143 ఆధ్వర్యంలో గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పోస్ట్‌కార్డు ఉద్యమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోస్ట్‌కార్డుల ద్వారా తమ డిమాండ్లను తెలియజేస్తూ వినతులు పంపించారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు కల్లోజు శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టులు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతున్నప్పటికీ, ప్రధాన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
అర్హత కలిగిన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు ఎలాంటి ఆంక్షలు లేకుండా హెల్త్ కార్డులు మంజూరు చేసి, ఉద్యోగులతో సమానంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, మెరుగైన వైద్య సదుపాయాలు తదితర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని కోరారు.
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాపూజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోస్ట్‌కార్డు ఉద్యమం చేపట్టడం శుభపరిణామమని కల్లోజు శ్రీనివాస్ పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) వర్కింగ్ జర్నలిస్టుల విభాగం జిల్లా అధ్యక్షులు మట్టికొండ రవి, సహాయ కార్యదర్శి కాగితపు వెంకటేశ్వరరావు, సాక్షి బ్యూరో కృష్ణ గోవింద్, మోటమర్రి రామకృష్ణ, సీమకుర్తి రామకృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, చావా పాపారావు, కృష్ణారావు, రమేష్, రమణ, తారక్, అశోక్, చదలవాడ సూరి ప్రవీణ్, ఈశ్వర్, షబ్బీర్, శ్రీనివాస్, రాందాస్, జక్కంపూడి నరేష్, సత్య, శనగ లక్ష్మణ్, రహీం, స్వామి, గుంటుపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!