E-PAPER

చర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్‌గా చినిగిరి సుధాకర్ నియామకం

చర్ల, అక్టోబర్ 2 (Y7 న్యూస్ తెలుగు): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చినిగిరి సుధాకర్‌ను చర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించారు.

ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నల్లపు దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళీకృష్ణ, చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ నాయుడు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మచ్చ రాజా చేతుల మీదుగా సుధాకర్ నియామక పత్రాన్ని అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడుపూడి భాస్కర్‌రావు, మహిళా నాయకురాలు మడకం పద్మజా, లంక రాజు, పుగాకు సత్తిబాబు, మధ్యాల భాస్కర్, కోడిరెక్కల ప్రశాంత్, వన్నాల క్రాంతి, ఎస్సీ సెల్ చర్ల టౌన్ అధ్యక్షుడు వందేమూర్తి, జనరల్ సెక్రటరీ కొప్పుల సందీప్, చెన్నం పవన్, మచ్చ వరలక్ష్మి, గొర్ల సాయి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చినిగిరి సుధాకర్ నియామకంతో మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!