E-PAPER

గాంధీ జయంతి సందర్భంగా “జర్నలిస్టుల డిమాండ్ డే” నిర్వహణ

శ్రీకాకుళం, అక్టోబర్ 2 (Y7 News Telugu): గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం “జర్నలిస్టుల డిమాండ్ డే” నిర్వహించారు.

ఈ సందర్భంగా నగరంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించిన అనంతరం జర్నలిస్టులు తమ సమస్యలు, డిమాండ్లను ప్రతిబింబించే బ్యానర్లతో నిరసన వ్యక్తం చేశారు.
జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని అమలు చేయడం, వర్కింగ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించడం, ప్రయాణ రాయితీలు, ఆరోగ్య భద్రత, ప్రెస్ అక్రిడిటేషన్ తదితర సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో APUWJ జిల్లా నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, వివిధ మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!