E-PAPER

వైద్యుల నిర్లక్ష్యం, మూఢనమ్మకాల నడుమ పసికందు బలి..

ఏజెన్సీలో వరుసగా పసికందుల మరణాలు జరుగుతున్న అధికారుల చర్యలు శూన్యం..

చింతూరు, ( వై7 న్యూస్ తెలుగు), సెప్టెంబర్ 13: పోలవరం జిల్లా, చింతూరు మండలం, లచ్చిగూడెం పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన కొవ్వసి ఉంగయ్య, ఐతమ్మ దంపతుల రెండు నెలల పసికందు మృతి చెందిన ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ వైద్యుల ప్రాథమిక నిర్లక్ష్యంతో మొదలైన ఈ విషాదం, ఆపై ప్రైవేట్ చికిత్సలు, మూఢనమ్మకాల చుట్టూ తిరిగి చివరకు పసిగుడ్డు ప్రాణాలను బలితీసుకుంది.

నిర్లక్ష్యం చేసిన పీహెచ్సీ.. తప్పుదోవ పట్టిన వైద్యం :

బాబుకు ఫిట్స్ (ఫీడ్స్) రావడంతో తల్లిదండ్రులు మొదట ఏడుగ్రాళ్లపల్లి పీహెచ్సీకి పరుగెత్తారు. అయితే అక్కడి సిబ్బంది బాబు బాగున్నాడని నిర్లక్ష్యంగా ఇంటికి పంపించివేశారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే బాబుకు మరోసారి తీవ్రంగా ఫిట్స్ వచ్చాయి. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే చింతూరులోని ఒక ఆర్‌ఎంపీ (RMP) వైద్యుని వద్దకు పరుగులు తీశారు.చింతూరు ఆర్ఎంపి వైద్యులు చేసి మందులు ఇచ్చి ఇంటికి పంపించి వేశారు ఆయన ఫిట్స్ తగ్గలేదు.

మూఢనమ్మకాల వైపు అడుగులు.. చివరికి విషాదం:

ఆధునిక వైద్యం సకాలంలో అందకపోవడం, ఆర్‌ఎంపీ వద్ద కూడా ఫలితం లేకపోవడంతో నిస్సహాయులైన తల్లిదండ్రులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపారు. బాబు ప్రాణాలను కాపాడుకునేందుకు పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ‘వడ్డే’ నాటు వైద్యుడు మంత్రగాడు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పూజలు, నాటు వైద్యం చేయించి తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అయితే, అప్పటికే పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే ఆ రెండు నెలల పసికందు ప్రాణాలు విడిచాడు.తొలి విడతలోనే ఏడుగ్రాళ్లపల్లి పీహెచ్సీ వైద్యులు బాబుకు సరైన అత్యవసర వైద్యం అందించి, మెరుగైన ఆసుపత్రికి రిఫర్ చేసి ఉంటే ఈ రోజు ఒక ప్రాణం నిలిచేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం, ఆపై ఆర్‌ఎంపీల చుట్టూ, ఛత్తీస్‌గఢ్ వడ్డేల చుట్టూ తిరగాల్సి రావడం వల్లే బాబు సకాలంలో సరైన వైద్యం అందక మృతి చెందాడని స్పష్టమవుతోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!