రూ.19.62 లక్షల విలువైన చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష

శ్రీకాకుళం జిల్లా, పలాస | Y7 News Telugu | సెప్టెంబర్ 12:
పలాస నియోజకవర్గంలోని 27 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) కింద మంజూరైన రూ.19,62,767 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గౌతు శిరీష పంపిణీ చేశారు. పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసాగా నిలుస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని ఆమె తెలిపారు. వైద్య చికిత్సల కోసం ఆర్థిక సహాయం అవసరమైన కుటుంబాలకు CMRF ద్వారా మరింత అండగా నిలిచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Post Views: 21








